Wednesday, April 25, 2012

భగవద్గీత గురించి భజగోవిందం ఏమంటొంది?

భజగోవింద శ్లోకం:

భగవద్గీతా కించిదధీతా 
గంగా జలలవ కణికాపీతా|
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన స చర్చా||

శ్లోకం అర్ధం :
భగవద్గీతను ఏ కొద్దిగా అధ్యయనము చేసినను, గంగానదీ జలములోని ఒక బిందువునైనా త్రాగినను, ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు. అలాంటివాడికి యముని వలన ఏ మాత్రమూ భయము ఉండదు(దీనర్థము చావు అంటే భయం పోతుందని).

4 comments:

ఎందుకో ? ఏమో ! said...

మానవుని యొక్క దైనందిన సామాన్య విషయాల యందు సైతం ఎలా మెలగాలో, జీవన విధి విధానాలు ఏరీతిన ఏ లక్ష్యం తో ఎంత నేర్పుతో జరగాలో ఓర్పుతో 18 అధ్యాయాల ద్వారా వివిధ రకాల మార్గాలను అవలంబించే వారికి, ఎవరి మార్గానికి సరిపడా వారికి, సులువు జెప్పెడి భగవద్గీత ప్రధాన ఉద్దేశ్యం: మానవుని స్వస్థితిని ఎరుక పరచటమే.
పరమ పవిత్ర గంగా మాత యావత్ భారతావనికి జీవాన్ని ప్రసాదిస్తూ ఎట్లు పవిత్ర మొనర్చు చున్నదో, అట్లే యావత్ మానవాళినీ కూడా ఈ భగవద్ వచనాలు (దేవుని నోట వెలువడిన వాక్యాలు) తరింప చేయుచున్నవి.
అందుచేత వీటిలో ఏ వోక్కటైనను ఆదర్శముగా గ్రహించి ఆచరణకు దిగి అమలు పరచిన, అది పరమ ప్రయోజనమైన మోక్ష ఆనంద కారకమైన జ్ఞానాన్ని కలిగించును. ఇట్టి జ్ఞానము వలన తన యొక్క నిత్యత్వ సహజ స్థితిని తెలిసిన వాడై తాను ఎవరో, మరణం దేనికో స్పష్టమైన అభిప్రాయము పొందిన వారు మరణమును గూర్చిన భయము లేనివారే కాక మరణయాతన సైతం లేనివారగు చున్నారు.

జై జగద్గురు అది శంకరాచార్య ||

Srikanth Dharmavaram said...

Hi Suresh, This is Srikanth. I am Your polytechnic friend & Room mate. where are you now?

Unknown said...

in bagavat gite there is one mistake. that is 7th adyayam & 15th adyayam was same that means 15th adyayam was repeatedly copied in 7th adyayam.
so please correct this and put 7th adyayam saramsam

regards,

sambasiva rao
khammam

Somesh said...

THANK YOU SURESH