ఈ అధ్యాయం మొదటిది.
ధృతరాష్ట్రుడు సంజయుడితో మొదటిరోజు యుద్ధ విశేషాలు అడిగాడు.అప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు.
కౌరవులు,పాండవులు వారివారి బలాల గురించి,యోధుల గురించి అలాగే ఎదుటివారి
బలాల,యోధుల గురించి పన్నిన,పన్నవలసిన వ్యుహాలగురించి మాట్లాడుకున్నారు.
అప్పుడు కౌరవులబలం,వారిలోని యోధుల గురించి తెలుసుకొనే నిమిత్తం అర్జునుడు తన బావ మరియు సారథి ఐన శ్రీకృష్ణుడితో తమ రథాన్ని రెండు సేనల మధ్యకు నడపమని చెప్పాడు.కృష్ణుడు అలానే చేసాడు.
అప్పుడు అర్జునుడు కౌరవులలోని తన పెదనాన్న బిడ్డలను,గురువులను,వయోవృద్ధులను అనగా భీష్ముడు,ద్రోణుడు,కృపాచార్యుడు మొదలగు పెద్దలను చూసి గుండె కరిగిపోయి కృష్ణునితో ఈ విధంగా అన్నాడు.
"కృష్ణా!అందరు మనవాళ్ళే,వారిలో కొందరు పుజ్యనీయులు.వారినందరినీ రాజ్యం కొరకు చంపి నేను ఏవిధంగా సుఖపడగలను?అయినా జయాపజయాలు దైవాధీనాలు కదా.ఎవరు గెలుస్తారో తెలియదు.వారు నన్ను చంపినా నేను మాత్రం వారిని చంపను.దుఃఖం చేత నేను,నా అవయవాలు స్థిమితం కోల్పోతున్నాయి"అని అంటూ తన ధనుర్బాణాలు వదిలివేసి దుఃఖించసాగాడు.
ఇక్కడితో మొదటి అధ్యాయం పూర్తవుతుంది.
7 comments:
గొప్ప ప్రయత్నమ్
అభినందనలు
మీ బ్లాగు చూసాను. కానీ పూర్తిగా చదవలేదు. సమయం చిక్కగానే చదువుతాను. కాని నా ప్రయత్నం సంస్కృత శ్లోకాన్ని, తెలుగులో శ్రీ పూడిపెద్ది వారి ఆంధ్రానువాద పద్యాన్ని, శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారి తెలుగు తాత్పర్యాన్ని ఒకేచోట ఓ పట్టికరూపం లో ఇవ్వాలనేది. దీనివలన నేను ఆశిస్తున్న లాభాలు.
1. సంస్కృత శ్లోకాన్ని ,తెలుగు పద్యాన్ని ,తెలుగు వచన భావాన్నిఒకేచోట చదవటం వలన పాఠకునిలో సంస్కృతభాషా పరిచయం బాగా పెరుగుతుందనిన్నీ తెలుగు పద్యం సొగసుల్ని ఆనందించే అవకాశం కలగటంతో పాటు భగవద్గీతను అర్థం చేసుకొనే అవకాశం పాఠకులకు కలుగుతుందనిన్నీ,
2.నేను కూడా ఈ మార్గం ద్వారా అందరితో పాటుగా భగవద్గీతా పారాయణ పుణ్యాన్ని సంపాదించుకోగలననే ఆశపడుతున్నాను.
from satyanarayana.
bagavtgita saraamshanni sarala basha lo unchina mee prayatnam abhinandaneeyam. Bagavat gita saramshanni teleusukovalane aasakthi unna saamanulaku baga upakaristundi.
Abhinandanalu.
Satyanarayana.m
Rayachoty.
mail:modemsatya@gmail.com
WONDERFUL WORK,,,,INDIA NEEDS PEOPLE LIKE YOU
Interesting blog.
ఈ బ్లాగును కూడా చూడగలరు.
http://te.wikisource.org/wiki/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80_%E0%B0%97%E0%B1%80%E0%B0%A4%E0%B0%BE%E0%B0%AE%E0%B1%83%E0%B0%A4_%E0%B0%A4%E0%B0%B0%E0%B0%82%E0%B0%97%E0%B0%BF%E0%B0%A3%E0%B0%BF_-_%E0%B0%85%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B1%81%E0%B0%A8%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%BE%E0%B0%A6_%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97%E0%B0%AE%E0%B1%81
http://geetaamrutham.blogspot.in/
Post a Comment